
జనం న్యూస్ మే 15 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో బీజేపీ నాయకులు ఆత్మ కమిటీ డైరెక్టర్ మద్దoశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బండారు సత్యనందరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంఠంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు ముందుగా బండారు జన్మదినo సందర్బంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు కి పంచిపెట్టారు. ముఖ్య అతిధులు మాట్లాడుతూ ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే దానికి ముఖ్య కారణం బండారు అని, వాడపల్లి దేవస్థానం అభివృద్ధి, టెంపుల్ టూరిజం అభివృద్ధి, అదే విధంగా రోడ్లు, అభివృద్ధి జరుగుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర యువ మోర్చా నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొలకోటి వెంకటేశ్వరరావు,దైవలా నాగేశ్వరావు, సత్తిబాబు, రాంబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.