
జనం న్యూస్, జూలై 8,2026 : ముమ్మిడివరం ప్రతినిధి బీజేపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలుచేపట్టిన అనంతరం తొలిసారిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాన్సెప్ట్ జిల్లా అమలాపురం విచ్చేసిన యాళ్ల దొరబాబు బీజేపీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ , బీజేపీ ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి దొరబాబు నాయకత్వంలో అమలాపురం పార్లమెంట్ పరిధిలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపురెడ్డి భైరవమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు సకిరెడ్డి శ్రీనివాస్ తాళ్లరేవు మండల అధ్యక్షులు యనమండ్ర విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు