
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేవైఎం జోనల్ ఇంచార్జ్ కొండేటి ఈశ్వర్ గౌడ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నూతన ఎఫ్ డి సి కొరియర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు హాజరై ఈశ్వర్ గౌడ్ ను అభినందించారు. బిజెపి గుంటూరు జిల్లా ఇంచార్జ్ యళ్ల దొరబాబు, బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, ఇళ్ల సత్యనారాయణ, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గనిసెట్టీ అరవింద్, బిజెపి నాయకులు గణాల సాయి, పెద్దిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు. యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని, కొత్త వ్యాపారాలు ప్రారంభించి ఇతరులకు ఉపాధి కల్పించాలని నాయకులు సూచించారు. కొరియర్ సేవల ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందుతాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఈశ్వర్ గౌడ్ కు తన అండ ఎప్పుడూ ఉంటుందని, పార్టీ కార్యకర్త ప్రతి వ్యక్తికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కొండేటి ఈశ్వర్ గౌడ్ భవిష్యత్ లో మరిన్ని శాఖలు ప్రారంభించి వ్యాపారాన్ని విస్తరించాలని అందరూ శుభాకాంక్షలు తెలిపారు.