
యోగాతో మానసిక ఏకాగ్రత - రవికుమార్
జనం న్యూస్ -జూన్ 21- నాగార్జున్ సాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని బీసీ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో శనివారం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో యోగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రవికుమార్ మాట్లాడుతూ సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి మానసిక ప్రశాంతతకు యోగా ఒక అద్భుతమైన సాధనమని నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడిని జయించి చదువులో రాణించాలంటే ప్రతిరోజు యోగా సాధన చేయటం ఎంతో అవసరం అని ఆయన తెలిపారు, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు అని అది శరీరాన్ని మనస్సును అనుసంధానించే ఒక జీవన విధానం నిరంతరం యోగా చేయడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతాయని ప్రిన్సిపాల్ రవికుమార్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటిపి కల్పన, వెంకటేష్ ,పీడీలు జ్యోతి, అరుణ ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.