
జనం న్యూస్ 20 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా జూలై 5 తేదీన భువనగిరి లో నిర్వహించ బోయే బారీ బహిరంగ సభకు జోగులాంబ గద్వాల జిల్లా సగర సంఘం అధ్యక్షుడు యూ తిమ్మప్ప కి ఆహ్వాన పత్రిక ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ అందజేశారు.ఈకార్య క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు గంగాధర్,వైస్ ప్రెసిడెంట్ పి జి కే గోవింద్ రాజు మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ యూ రాముడు. జక్కి రెడ్డిపల్లి వెంకటేష్,సగర సంఘం జనరల్ సెక్రటరీ మంజు రామ్,సగర సంఘం కార్యవర్గ సభ్యులు,మొరుగు కృష్ణ,చంద్రబండ ఆంజనేయులు,ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ మాట్లాడుతూ…తెలంగాణ వ్యాప్తంగా బీసీ ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల రాజ్యాధికార స్థాపనకోసం సమస్త కుల వృత్తుల వారు సంఘటితమై,భువనగిరి సభను విజయవంతం చేయగలరని, యావత్ బీసీ కులాలు పార్టీల కతీతంగా ఏకం కావాలని అప్పుడే బీసీ రాజ్యాధికారం సుసాధ్యమవుతుంది .అన్నారు.