

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 11 పీఎంఫబయ్ పంటల భీమా యోజన పధకం గడువు ఆగస్టు 15 న ముగుస్తుంది కావున రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. పంటల భీమా చేసిన రైతులు తప్పనిసరిగా అదే పంటను సాగుచేసి, గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా పంట నమోదు చేయించుకోవాలని చెప్పారు.కంది విత్తనాలు ఎల్ ఆర్ జి -52 రకం 30% సబ్సిడీ పై రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కావలిసిన రైతులు తమ విఏఏ వద్ద రిజిస్ట్రేషన్, నగదు చెల్లించి విత్తనాలు పొందవచ్చని తెలిపారు. పశుగ్రాసం కోసం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా పీఎండ్స్ విత్తనాలు కిట్లు అందిస్తామని తెలియజేశారు. రిలయన్స్ ఫౌండేషన్ డీపీఎం సర్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఎఫర్ట్ నాగో ద్వారా వ్యవసాయం, విమెన్ ఎంపవర్మెంట్ మొదలగు రంగాలలో రైతులు, మహిళల అభివృద్ధికి వారి సహకారంతో కేతగుడిపి గ్రామంలో వారి సేవలను అందిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో వి ఏ ఏ మల్లికార్జున , ఏ హెచ్ ఏ భార్గవి, పొదిలి మార్కెట్ యార్డ్ సిబ్బంది చెన్నయ్య,ఏపీసీన్ఫ్ సిబ్బంది బేబీ,రైతులు పాల్గొన్నారు.