

పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
జనం న్యూస్ 31-07-2026 జహీరాబాద్ పట్టణంలోని హమాలి కాలనీలో గల పెద్దమ్మ దేవాలయం కు శాంతినగర్ ఐ డి ఎస్ ఎం టి కాలనీ హమాలి కాలనీ ప్రజలు ఆదివారం నాడు పెద్దమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది బోనాలు తీయడానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలతో కూడిన బురద రోడ్ల నుండి అపరిశుభ్రమురికి కాలువల పక్కనుండి బోనాలు తీయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది వాస్తవానికి వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రత కొరకు తెలంగాణ ప్రభుత్వం పురపాలక సంఘాలకు కోట్లాది రూపాయలు నిధులను విడుదల చేసిన జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హమాలి కాలనీ ప్రధాన మైన రోడ్డు శుభ్రత లేకపోవడం శోచనీయం బాధాకరం ఇకనైనా ఒకరోజు సమయం మిగిలి ఉన్నందున పెద్దమ్మ తల్లి దేవాలయం కు వెళ్లే ప్రధానమైన రోడ్డు బుర్దమయంగా ఉన్నందున చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు ఆ రోడ్డు గుండా వెళ్లాలి అంటే జారి పడగలమని భయపడుతున్నారు కావున మొరం గాని లేదా సన్నటి కంకర లాంటిది వేసి పండుగను పరిశుభ్ర వాతావరణంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు జరగకుండా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని హమాలీ కాలనీ ప్రజల తరపు నుండి కోరడం జరుగుతుంది