
జనం న్యూస్ ఆగస్టు 31 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని పలు సూచనలు తెలియజేయడం జరిగింది అంతలోపు చేసుకోకూడదని పై చదువులు చదువుకోవాలని సూచించారు ముందుగా నాణ్యమైన విద్యను అభ్యసించి తదనంతరం పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు రక్షాబంధన్ పురస్కరించుకొని మండలంలోని పలు అధికారులకు బాలికల ద్వారా రాఖి కట్టించడం జరిగింది అలాగే బేటి బచావో బేటి పడావో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పోలీస్ సిబ్బంది పలు శాఖల అధికారులు ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోషిమాత అంగన్వాడీ టీచర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు