
మద్నూర్ ఆగస్టు 18 జనం న్యూస్ బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మద్నూర్ SI ఎ. మోహన్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం.. దేగ్లూర్‌కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాజ్లు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని చాకూర్ పోలీసులకు గతంలో పట్టుబడిన వీరు తెలంగాణలోని మద్నూర్, డోంగి ప్రాంతాల్లో బైక్ చోరీ చేయాలని ముందస్తుగా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో జూలై 28న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో డోంగి గ్రామంలోని జాదవ్ దీపక్ ఇంటి కాంపౌండ్ గేట్ తాళాన్ని పగలగొట్టి, అవరణలో ఉన్న హోండా షైన్ బైక్ TS 16 ET 7946ను చోరీ చేసినట్లు తెలిపారు.