
జనం న్యూస్ జూలై 2 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజవర్గంపల్లిపాలెంప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అభియాన్ మిషన్ గ్రామీణ పథకానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా, బోడసకుర్రు పంచాయతీ పరిధిలోని పల్లిపాలెంలో ఈ పథకాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా అడపా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ పథకం ఉపాధి కూలీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని తెలిపారు.పథకంలోని ప్రధాన అంశాలు:బిల్లు చెల్లింపు: పనిచేసే కూలీలకు 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించాలి. ఆలస్యమైతే 0.5 శాతం వడ్డీతో చెల్లించాలి.పని దినాలు పెంపు: పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు.వేతన పెంపు: దినసరి వేతనాన్ని 299 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచారు.బీమా సౌకర్యం: ప్రతి ఉపాధి కూలీకి లక్ష రూపాయల బీమా పథకం వర్తిస్తుంది.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగు యువత అధ్యక్షులు ముత్యాలబావి ఆత్మ, డైరెక్టర్ ఓలేటి పరమేశ్వరావు, సొసైటీ డైరెక్టర్ మొయిల గణపతి, జల్లి రాధాకృష్ణ, దొమ్మేటి భావన, నాగరాజు, పంచాయతీ గుమస్తా చిట్టిబాబు, పథకం ఫీల్డ్ ఆఫీసర్ బొంతు శ్యాంప్రసాద్, ఆరోగ్య సిబ్బంది, పి.డి.ఆర్.ఎస్ సిబ్బంది, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.