
జనం న్యూస్ :23 మే శనివారం; సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేటలోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో మే 23 శనివారం ,24 ఆదివారం ,25 సోమవారం మూడు రోజుల వేసవి శిబిరంను నిర్వహిస్తున్నారు. ఈరోజు ఐదవ అధ్యాత్మిక బాలానందం వేసవి శిబిరంను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీ ఫౌండర్స్ రామిని మధు, ఆచి విజయ్, మిమిక్రీ రమేష్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకురాలు బి కే భవాని మాట్లాడుతూ ఆధ్యాత్మిక వేసవి శిబిరం ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలను పెంపొందించడమే ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.తదనంతరం విచ్చేసిన అతిధులు పిల్లలను ఉద్దేశించి ఈ ఆధ్యాత్మిక వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. మూడు రోజులలో భాగంగా మొదటి రోజు మిమిక్రీ వై రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు మ్యాజిక్, మిమిక్రీ నేర్పించారు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భవాని అబాకస్ పాఠాలు బోధించారు, మిగతా రెండు రోజులలో డ్రాయింగ్ కాంపిటేషన్, డ్రామా కాంపిటేషన్లు నిర్వహిస్తున్నాము అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బి కే సంస్థ ప్రతినిధి బీ కే. స్వప్న, వై. ఓంకారం, డాక్టర్ ఉదయ్, బిందు, పద్మ, కరుణ తదితరులు పాల్గొన్నారు.