
సబ్ టైటిల్ :-అంగరంగ వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 04-09-26 నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి, అరవపల్లి గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వ హించారు.ఈ వేడుకలకు రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు యల్లటూరు శ్రీనివాసరాజును ఘనంగా సన్మానించారు.శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు