
జనం న్యూస్ ఆగస్టు 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది ప్రక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి ఆలయం ఆదివారము రోజున భక్తులతో కిటకిటలాడింది ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు తదనంతరంపూజా కార్యక్రమాలు అమ్మవారికి మొక్కులు చెల్లించి పొడి బియ్యం సమర్పించారు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రభాకర్ శర్మ సుబ్రహ్మణ్య శర్మ మోతిలాల్ శర్మ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని పురోహితులు ఆశీర్వచనం అందించారు