
జనం న్యూస్ జూలై 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; ఏ.వి.బి పురం లో గత రెండు వారాలుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో లేబర్ కార్డ్ మరియు ఈ-శ్రమ్ కార్డ్ నమోదు చేయించుకున్న భవన నిర్మాణ కార్మికులకు ఇతర కార్మికులకు కూకట్పల్లి నియోజక వర్గం జనసేన పార్టీ కంటెస్ట్ ఎం.ఎల్.ఏ మరియు పార్టీ జాయినింగ్ కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చేతులమీదుగా అందించడం జరిగింది.ఈ సందర్భముగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్మిక కుటుంబాలకు ఆర్ధిక రక్షణ ఇస్తాయని అన్నారు. ప్రతి కార్మిక కుటుంబానికి జనసేన ప్రార్టీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గం జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, ఏ.వి.బి పురం జనసైనికులు టి. ప్రసాద్ రావు, వై.దనుజయ్, బి. రాము,జి. దుర్యోదన , డి కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.