

జనం న్యూస్ 01 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా భారత్ మాల గట్టు మండల అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భారత్ మాల అప్రోచ్ రోడ్డు కోసం167రోజు రిలే నిరాహార దీక్ష చేసి వారి దీక్ష విరమణ చేయించి నిమ్మరసం అందజేసిన ఎమ్మెల్యే ఈరోజు గద్వాల నియోజకవర్గం లో గట్టు మండలం రాయపురం స్టేజ్ దగ్గర గట్టు మండలం భారత్ మాల అప్రోచ్ రోడ్డు నిర్మాణాలకు కొరకు 167 రోజులు దీక్ష చేసిన రాయపురం గ్రామస్తులకు దీక్షను విరమించి నిమ్మరసం ను అందజేసి భారత్ మాల రోడ్డు గట్టు మండలం అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది.భరత్ మాల గట్టు మండలం లోని అప్రోచ్ రోడ్డు నిర్మాణం కొరకు 167 రోజులు మాజీ సింగల్ విండో చైర్మన్ రాముడు ఆధ్వర్యంలో గ్రామస్తులు మండలంలోని ప్రజలు ప్రతిరోజు రిలే నిరాహార దీక్షను చేసి చివరికి రోడ్డు నిర్మాణం ఎమ్మెల్యే సహకారంతో సాధించుకోవడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో గట్టు మండలంలో భారత్ మాల రోడ్డు నిర్మాణం కావడంతో గట్టు మండలంలోని రాయపురం స్టేజి దగ్గర అప్రోచ్ రోడ్డు నిర్మాణం కొరకు గ్రామస్తులు 167 రోజులపాటు రిలే నిరాహార దీక్షను చేయడం జరిగింది.గద్వాల నియోజకవర్గం గట్టు మండల అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలోని భారత్ మాల వంటి రహదారి నిర్మాణం పనులు కావడంతో ఈ ప్రాంతం నుండి మైసూర్ పూనే వరకు రోడ్డు నిర్మాణం ఇటు తమిళనాడు వరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని దురదృష్టతో ఆలోచించి అధికారులతో దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డు నిర్మాణముకు కృషి చేయడం జరిగింది.భవిష్యత్తులో తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో రహదారి లకు వెళ్లడానికి సులభం అవుతుంది అదేవిధంగా వ్యాపార సంబంధాలు అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా రైతులు పంటలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి దిగుమతి చేయడం వల్ల రైతుల కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు రావడం జరుగుతుంది ఇండస్ట్రీ రావడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ మార్గంలో అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేయాలని భారత్ మాల అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్లి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డును మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.ఇటీవలే భారత్ మాల రోడ్డు సమీపం లో రాయపురం స్టేజి దగ్గర 133 హై టెన్షన్ సబ్స్టేషన్ మంజూరు కావడం జరిగింది. వాటిని కూడా 220 హై టెన్షన్ సబ్ స్టేషన్ గా మార్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనితో ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్యను కొంతమేరకు తగ్గించడం జరుగుతుంది రైతులకు 24 గంటల కరెంటు లభిస్తుందని పేర్కొన్నారు.లెనోవా ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉన్నది అయినా కూడా రైతులకు ఎలాంటి నీటి సమస్య ఉండకుండా ఉండాలని నీటిని నిలువ ఉంచడం జరిగింది రైతులకు రెండు పంటలకు నీళ్లు అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.భవిష్యత్తులో గట్టు మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా నా వంతు సహాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంతు పి ఎ సి యస్ ఛైర్మెన్ వెంకటేష్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడ మాజీ ఎంపీపీ విజయ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ సర్పంచ్ మాజీ సింగల్ విండో రాముడు నాయకులు గద్వాల తిమ్మప్ప సిద్ది రామప్ప అలీ శ్రీనివాస్ రెడ్డి సంతోష్ కృష్ణ రాజప్ప గౌడు రామకృష్ణ నాయడు మధుసూదన్ రెడ్డి గోవిందు సిద్దు ఆనంద్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు