

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జులై 31. 07. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు, కాలువలు పొంగిపొర్లే పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప వరద ప్రవాహాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. రైతులు తమ పంట పొలాల్లో నీటి నిల్వను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్ తీగలు తెగి పడిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎలాంటి ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని, వర్షాల సమయంలో అనవసర ప్రయాణాలు చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని చిట్టెంపల్లి బాలరాజ్ పేర్కొన్నారు