
జనం న్యూస్ 06 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, చాగపురం గ్రామంలో మాదిగలపై జరిగిన కుల వివక్ష దాడిని బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధితులకు న్యాయం చేయమని అడగడం నేరమా పోలీసుల ఈ అప్రజాస్వామిక చర్యలు దేనికి సంకేతంబాధితుల పక్షాన నిలబడే మమ్మల్ని ఇలా అక్రమంగా అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే.అక్రమంగా అరెస్టు చేసిన మా భీమ్ ఆర్మీ నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. లేనియెడల రాష్ట్రవ్యాప్త నిరసనలకు భీమ్ ఆర్మీ పిలుపునిస్తుంది.చాగపురం మాదిగ బాధితులకు తక్షణమే న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు మెల్లచెరువు వర్షిత్ ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ మల్లకల్ మండల అధ్యక్షులు నాగర్ దొడ్డి ప్రతాప్ ఉపాధ్యక్షులు నాగర్ దొడ్డి వంశీ ఐజ బీమ్ ఆర్మీ నాయకులు ఎక్లాస్ పురం కృపాకర్ మేడికొండ సుందరాజు విఠలాపురం ప్రసాద్ ఎక్లాస్ పురం పుట్ట ప్రసాద్ జాన్ చరణ్ తదితరులు