
పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 17జులై పెగడపల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ-సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోనితమ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పిలుపునిచ్చారు.ల్యాగలమర్రి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎలుకతుర్తి రవి అధ్యక్షతన నిర్వహించిన భూభారతి రీ-సర్వే గ్రామసభకు తహసీల్దార్ నిజాముద్దీన్ తో కలిసి బుర్ర రాములు గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమానికి రైతులు పూర్తి సహకారం అందించి, రీ-సర్వే ద్వారా తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.అదేవిధంగా తహసీల్దార్ నిజాముద్దీన్ ని గ్రామాల్లో భూ రీ-సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.ప్రతి గ్రామంలో రెవెన్యూ భూములను శాస్త్రీయంగా సర్వే చేయడం వల్ల రైతులందరికీ న్యాయం జరుగు తుందని, భూ వివాదాలు తగ్గుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, సర్వేయర్ తనూజా రాణి, రెవెన్యూ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.