
జనం న్యూస్ సెప్టెంబర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఇందిరాపార్క్: భూ భారతి పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులకు చెందిన భూములను సెక్షన్ 22A పరిధిలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ‘ఛలో ఇందిరాపార్క్–మహా దీక్ష’ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్ పాల్గొన్నారు.ప్రజల భూముల హక్కులను పరిరక్షించడంతో పాటు రైతులు, సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆయన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన భూములపై హక్కులను కాపాడేందుకు బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని కాంచి మహేందర్ పేర్కొన్నారు. పేదలు, రైతులు, మధ్యతరగతి కుటుంబాల భూ హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.“ప్రజల భూముల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.