
జనం న్యూస్, 2026 మే 18, గంగాపూర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, గంగాపూర్ గ్రామ శివారులోని, పల్లె ప్రకృతి వనంలో, మంటలు చెలరేగాయి.వేసవి తీవ్రత, పొడిగడ్డి కారణంగా, మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో, వనంలోని అనేక మొక్కలు, పచ్చదనం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అధికారులు నర్సరీలలో మొక్కలను పెంచి, నాటే పనిలో చూపించే శ్రద్ధ, వన సంరక్షణలో చూపడం లేదని, గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.