
జనం న్యూస్ జూలై 1 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చేయరు గ్రామస్తులుమట్ట సూర్యప్రకాశరావు, మట్ట సూరిబాబు సంయుక్త జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగాయి.సోదరులిద్దరూ కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు, సన్నిహితులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వచ్చిన అతిథులకు స్వీట్లు పంచిపెట్టారు.సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న సోదరులకు అందరూ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.