
జనం న్యూస్ జూలై 14 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )బీబీపేట మండల కేంద్రంలో సోమవారం మల్లు గారి కాశిరాం కుమార్తె అయిన మల్లు గారి భార్గవి (20) ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అని విషయం తెలియగానే ఎస్సై కొండవిజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.. వివరాల్లోకి వెళితే భార్గవి వాళ్ళ అమ్మ గత రెండు సంవత్సరాలుగా కుటుంబాన్ని విడిచి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలుపడినట్లు తన తండ్రి అయిన మల్లు గారి కాశీరాం తెలిపారు. అని ఎస్సై తెలుయ చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు బాడీని తరలించడం జరిగింది. మృతురాలి తండ్రి మల్లు గారి కాశీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కొండ విజయ్, తెలియ చేశారు..