
జనం న్యూస్ మే 25 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు-2026’ పండుగ కార్యక్రమాలను విజయవంతం చేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 27, 28వ తేదీలలో మహానాడు మహోత్సవాన్ని హైబ్రిడ్ పద్ధతిలో, క్లస్టర్ల వారీగా నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సమన్వయంతో ముందుకు..నియోజకవర్గ శాసనసభ్యులు, ఇన్ఛార్జ్లు, కో-కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షుల పర్యవేక్షణలో.. క్లస్టర్ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. పార్టీ శ్రేణులన్నీ ఒక తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని ఆయన కోరారు. "తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడులో జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి." డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పిలుపునిచ్చారు.*