
జనం న్యూస్ మే 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహానాడు పిలుపుమేరకు ఈరోజు ఉదయం అనకాపల్లి 81 వ డివిజన్ కస్టర్ ఇంచార్జ్ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన హైబ్రిడ్ పద్ధతిలో సన్ కష్టల్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలుగు తమ్ముళ్లు పసుపు రంగు చొక్కా వైట్ ప్యాంటు ధరించి మెడలో పార్టీ ఐడెంటి కార్డు వేసుకొని వచ్చి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగంతో ప్రారంభమైన కార్యక్రమానికి ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి వెలిగించి అన్న ఎన్టీఆర్ కు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పిలుపుమేరకు ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ అభినందనలు తెలియ జేసుకుంటూ 27,28 తేదీలలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అలాగే ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా అన్ని వార్డుల్లో అన్నకి నివాళులర్పించి 28వ తేదీ జరుగు కార్యక్రమానికి యధావిధిగా హాజరుకావాలని గోవింద కోరారు. జిల్లా అధ్యక్షులు బత్తుల తాతీయ్యబాబు మాట్లాడుతూ పొదుపుచర్యలో భాగంగా హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం మహానాడు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో అధిష్టానం చెప్పిన విధంగా ఎక్కడికి అక్కడ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తాతయ్య బాబు తెలియజేశారు. పార్టీ పరిశీలకలు గా విచ్చేసిన సర్వసిద్ధి అనంతలక్ష్మి మాట్లాడుతూ అనకాపల్లి పట్టణ పరిధిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాలు చక్కగా ఏర్పాటు చేశారని కార్యకర్తలు క్రమశిక్షణతో పాల్గొన్నరని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కే కే వి ఏ నారాయణరావు కొణతాల వెంకటరావు బొలిశెట్టి శ్రీనివాసరావు కాండ్రేగుల సత్యనారాయణ కాండ్రేగుల చిన్న మల్ల నరసింగరావు మల్ల రాజు కొణతాల నూక నాయుడు ధనాల విష్ణుచౌదరి పొలిమేర నాయుడు పీలా శ్రీను చంద్రశేఖర్ వేదుల సూర్యప్రభ బొడ్డేడ శంకర్రావు మల్ల గణేష్ మారిశెట్టి శంకర్రావు బుద్ధ కాశి తదితరులు పాల్గొన్నారు.//