
జనం న్యూస్ 03 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా జిల్లా దివ్యాంగుల మహిళా విభాగం అధ్యక్షురాలు వడ్ల మంజుల జోగులాంబ గద్వాల జిల్లా దివ్యాంగుల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వడ్ల మంజుల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అయినా కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఇప్పటివరకు అమలు చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు చెప్పిన హామీలు 5 శాతం రిజర్వేషన్, ఉచిత బస్సు ప్రయాణం ఆసరా పింఛన్ పెంపు,ఇందిరమ్మ గృహాలు వికలాంగుల హక్కుల చట్టాలు పటిష్టంగా అమలుపై ఇవన్నీ చెప్పిన ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్ర సీఎం ఎ నుము లరేవంత్ రెడ్డి చెప్పాలని ఆమె అన్నారు. అలాగే రాష్ట్రంలో 35 లక్షల పైన ఉన్న దివ్యాంగుల సోదరీ సోదరా మణులకు ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు అమలు చేయాల్సిందే మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాదిగ్యాంగుల సమాజాన్ని ఆదుకొని చెప్పిన వాగ్దానాలు అమలు చేస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆమె ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
