
తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్
జనం న్యూస్ జూన్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి కానుక – ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం కేపీహెచ్బీ కాలనీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు అన్నారు ఉచిత బస్సు ఉచిత విద్యుత్తు గ్యాస్ సిలిండర్ పెట్రోల్ బంకులు ఆర్టీసీ బస్సులను మహిళలకే కేటాయించారన్నారు ప్రతి నియోజకవర్గంలో సుమారు 70 వేల మంది మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానుకగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య ,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ,పిడికిటి గోపాల్ చౌదరి, కిలారు శ్రీనివాస్, బాబు, రంగమోహన్ ,రజిత ,కల్పన, వాణి, సుజాత ,వనజ ,జ్యోతి, రజిని ,మైఖేల్ ,బాబ్జి, రమణ, వాసు, బొచ్చు మళ్ళీ ,తమ్మినేని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.