
జనం న్యూస్ : 21జూలై మంగళవారం ; నియోజి కవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేటలో మైత్రివనం ఆధ్వర్యంలో మైదాకు కార్యక్రమం ఘనంగాసిద్దిపేట, సంతోష్‌నగర్: సంతోష్‌నగర్‌లోని మైత్రివనం ఆధ్వర్యంలో మహిళలు సంప్రదాయబద్ధంగా మైదాకు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని, చేతులకు మైదాకు అలంకరించుకుని ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని జరుపుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు మహిళల మధ్య ఐక్యత, స్నేహభావం మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మైత్రివనం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.