
జనం న్యూస్ 29 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంలో మహిళా వారోత్సవాలు సందర్భంగా
మహిళాలకు సంఘూల వడ్డీ లేని రుణం 4కోట్ల 37 లక్షల రూపాయల చెక్కును మహిళా సంఘాలకు అందజేసిన ఎమ్మెల్యే ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మెప్మా ఐ కే పి అర్బన్ గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాల లోన్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే చైర్ పర్సన్ కి మెప్మా ఆర్పీలు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే చేతుల మీదుగా మెప్మా మహిళా సంఘాల ఆర్పీలకు మహిళా సంఘాల సభ్యురాలకు నాలుగు కోట్ల 37 లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతస్తు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా వివిధ రంగాలలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదుగుతుందని తెలిపారు మహిళా పొదుపు సంఘంలో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉండాలి సభ్యులుగా లేనివారు కూడా త్వరలో సభ్యులుగా ఏర్పడి మహిళా సంఘం లో చేరి మహిళా సంఘాలు ద్వారా కుటీర వ్యాపారస్తు మహిళలు అభివృద్ధి చెందాలి సీఎం చెప్పినట్లు మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళలు కోటీశ్వరులుగా కావడం జరుగుతుందని తెలిపారు గ్రామాలలో మహిళలను మహిళా సంఘాలలో సభ్యులు ఉన్నవారు మండలంలో పెట్రోల్ బంకులు సోలార్ బస్సు కొనుగోలు చేసి మహిళా సంఘాల ద్వారా నడిపించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా గద్వాల పట్టణంలోని కూడా మహిళలు ఆర్థికంగా బలపితం కావాలని ఇండస్ట్రీలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. మహిళలు పెద్ద ఎత్తున 50 మంది కలిసి ఒక పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే వ్యాపారం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా వివిధ రంగాల పై వ్యాపారాలపై మహిళలకు అవగాహన శిక్షణ కూడా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం అని తెలిపారు ఒకప్పుడు మహిళలు బ్యాంకులకు వెళ్లాలన్న ఇబ్బంది పడే వారిని, గత 15, 20 సంవత్సరాలుగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటై ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ రుణాలతో పిండి గిర్నీల ఏర్పాటు ఆహార ఉత్పత్తుల తయారీ ఏర్పాటు చేసుకుంటే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినది. మహిళా సంఘాలలో రుణాలు తీసుకొని వడ్డీ వ్యాపారం చేయడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుందని అన్నారు మహిళలు సూపర్ మార్కెట్లు, ఏర్పాటు చేసుకో విధంగా అదేవిధంగా మరి కొన్ని ఇండస్ట్రీలు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఆలోచన చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. మహిళలకు గ్రామీణ ప్రాంతాలలో ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది. పట్టణ ప్రాంతాలలో ఎనర్జీ ఎస్ ఎన్ఆర్జిఎస్ ఉండదు కాబట్టి మున్సిపాలిటీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు కట్టడం వల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకాక్ లో కూడా మరింత ఎక్కువ రుణాలను ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు మహిళా సంఘాల సభ్యులు దీని నిర్వహణతో నెలకు సుమారు రూ.3 లక్షల ఆదాయాన్ని అర్జించవచ్చు అన్నారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు నడిపేందుకు వీలుగా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుందని ఫలితంగా మహిళలు బస్సుల యజమానులుగా మారుతున్నారని పెట్రోల్ బంకుల నిర్వహణ తో కూడా లాభాలు ఆర్జించవచ్చని పేర్కొన్నారు. మహిళలు వివిధ వృత్తులు వ్యాపారాలకు సంబంధించి ప్రావీణ్యం పొందేలా గద్వాలలో త్వరలోనే మహిళ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళా సంఘాల సభ్యులందరూ వివిధ సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చీరలను ధరించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకే
తెల్ల రేషన్ కార్డు కలిగిన 18 ఏళ్లు నిండిన ఆడపడుచులు అందరికీ ఇందిరమ్మ చీరలను ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల్లో లేని ఇతర ఆడబిడ్డలను కూడా సంఘాల్లో చేరేలా ప్రోత్సహించాలని ఫలితంగా కుటుంబ నిర్వహణలో మహిళలు కీలక శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. మహిళలను ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని ఫలితంగా వారి కుటుంబ అభివృద్ధితోపాటు దేశ ప్రగతిలో ముఖ్య భూమిక వహిస్తారనడంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయడం జరుగుతుంది.మహిళా సంఘాలలో సభ్యులు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించడం జరుగుతుంది కాబట్టి రుణాలు తీసుకున్న మహిళలు వారి కుటుంబ అవసరాలకు వాడుకోకుండా ప్రభుత్వ నుంచి వచ్చిన బ్యాంకు ద్వారా వచ్చిన రుణాలను చిన్నచిన్న వ్యాపారాలను చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు.గద్వాల పట్టణంలోని కొన్ని మహిళా సంఘాల పెద్ద సభ్యులు మహిళా సంఘాల ద్వారా వచ్చిన డబ్బులను తీసుకొని వడ్డీ వ్యాపారం చేయడం జరుగుతుంది. అని అన్నారు వడ్డీ వ్యాపారం వంటివి చేయరాదని సూచించారు ప్రభుత్వం మహిళా సంఘాలు లోని సభ్యులైన మహిళల అభ్యున్నత కోసం రుణాలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పేద మధ్య తరగతి మహిళలు కుటీర పరిశ్రమలు ఇండస్ట్రీలను వంటి ఏర్పాటు చేసుకొని మహిళలు కూడా అన్ని రంగాలలో రాణించాలి అప్పుడు మహిళ అభివృద్ధి చెందినప్పుడు ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది అప్పుడు గద్వాల ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.మహిళా సంఘాలకు మహిళలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ బాబర్ ముత్యాల లక్ష్మి, వేదవతి వెంకటేశ్వర రెడ్డి నాగులు యాదవ్ రామలింగేశ్వర కాంమ్లే చంద్రశేఖర్ మాజీ కౌన్సిలర్ మురళి నాయకులు వంట భాస్కర్ రిజ్వాన్ సుదర్శన్ కో ఆప్షన్ నెంబర్ మున్సిపల్ కమిషనర్ మెప్మా సిబ్బంది మహిళా సంఘాల ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు