
జనం న్యూస్ జూలై 7 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం: మహిళల సంరక్షణకు తాము నిరంతరం పనిచేస్తూ ఉంటామని కాట్రేనికోన అదనపు ఎస్ ఐ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక సిద్ధార్థ డిగ్రీ కళాశాల నందు విద్యార్థిని లకు మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, వివాదాలకు దూరంగా ఉంటూ విద్యలో రాణిస్తూ జీవితంలో స్థిరపడాలని తెలియజేశారు. తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు వచ్చే విధంగా చదువులో రానిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమం లో కళాశాల సెక్రటరీ ఎం నాగరాజు, పోలీస్ సిబ్బంది జే చిన్నారావు, కే ఎస్ రాజు, పి సతీష్ వర్మ, కళాశాల అధ్యాపకులు ఎం సతీష్, కే రవి, ఏ శ్రీనివాస్, డి హెచ్ వి సత్యనారాయణ, జే అశోక్, కే స్వామి, స్వర్ణ లత,ఎన్ రాజు, సి హెచ్ సంతోషి కుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు