
జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారత దేశానికి సాంకేతికతను పరిచయం చేసి, ప్రపంచములో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ… దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి, కంప్యూటర్ యుగానికి నాంది పలికారని అన్నారు. దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. అతిపిన్న వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిరోహించి, దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు. యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు. నేడు ప్రజా ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిందం రవి ఏరుకొండ శంకర్ బాసని మార్కండేయ కొమ్ముల విష్ణు తదితరులు పాల్గొన్నారు…..