
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా కడప జిల్లా నందలూరు మండలం నూకినేనిపల్లె మాజీ సర్పంచ్ సంబావు శ్రీనివాసులు మృతిపై జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం బలిజపల్లిలోని శ్రీనివాసులు స్వగృహానికి వెళ్లిన యల్లటూరు శ్రీనివాసరాజు పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదించా లని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నేత మాజీ జడ్పీటీసీ సభ్యులు యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, అన్నం నాగేంద్ర, మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు, ఆకుల చలపతి, తిప్పాయపల్లి ప్రశాంత్, ముమ్మడిరాజు శంకర్రాజు, రుద్ర సాయిరాజు, రాజోలు సురేంద్రతో పాటు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొని సంబావు శ్రీనివాసులకు ఘనంగా నివాళులర్పించారు.