
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 25-06-2026 రాజంపేట మండలం కూచివారిపల్లి గ్రామానికి చెందిన గోదిరెడ్డి భావన చౌదరి కి మంజూరైన 45,013/- రూ. సీఎం సహాయ నిది చెక్కును భాజపా పార్లమెంట్ కార్యాలయం లో సాయి లోకేష్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సాయి లోకేశ్ మాట్లాడుతూ సీఎం సహాయనిది మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులని చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ ఇంచార్జీ మొగరాజు రమణయ్య , మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణాయాదవ్, మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షలు షబ్బీర్అహ్మధ్, జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు, సునీత నారాయణవర్మ, తోట రామయ్య, ,మండల రూరల్ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి , మరియు వివి రమణ, కమలాకర్, B. సుందర్, పెంచలయ్య, సుబ్ర మణ్యం,బూత్ అధ్యక్షురాలు శంకరమ్మ ,పార్టీ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.