
తాళం పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజయపురి టౌన్ ఎస్సై సతీష్
జనం న్యూస్-ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని డౌన్ పార్క్ వద్ద గల ముత్యాలమ్మ కాళికాదేవి ఆలయం కాలాలు పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, దొంగతనానికి యత్నం, ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజయపురి టౌన్ ఎస్సై సతీష్, నల్లగొండ క్లూస్ టీంకు సమాచారం ఇవ్వడంతో క్లోస్ టీం ఏ ఎస్ ఐ ప్రభు తన సిబ్బంది సలీం తో కలిసి వచ్చి ఆధారాలు సేకరించారు, ఎస్సై సతీష్ మాట్లాడుతూ రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేశారని, ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని అన్నారు.ఆలయ కమిటీ అధ్యక్షులు మంజుల జనార్ధన్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రమేష్ జి, మాయకోటి శంకర్, ఉపాధ్యక్షులు అలుపూరి శ్రీనివాస్, కే వెంకటేశ్వర్లు గౌడ్, జాయింట్ సెక్రెటరీ గోలి పరమేష్, చెరుకుపల్లి వాసు, నాగరాజు యాదవ్, కాంపల్లి రామస్వామి, యోహాను, ఆలయ పూజారి నారాయణ తదితరులు ఉన్నారు.