
జనం న్యూస్ జూన్ 14 (బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 500 మార్కులకు పైగా, ఇంటర్మీడియట్లో 920 మార్కులకు పైగా సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బాన్సువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి అభినందనలు తెలిపారు. బాన్సువాడ మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెట్టిగాడి అంజయ్య, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే బాన్సువాడ మున్సిపాలిటీ చైర్మన్ కాసుల విజయ, రోహిత్, ప్రదీప్ , విజయ ప్రకాశ్, మేకల విఠల్, శ్యామల, మంద ప్రవీణ్ కుమార్,కొట్టాల గంగాధర్, పాల్గొని విద్యార్థుల ను అభినందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యారంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మున్నూరు కాపు సమాజం నుంచి మరింత మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మున్నూరు కాపు కుల బాంధవులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.