
జనం న్యూస్ 10 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల సాధారణంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు అంటే సభ్యుల మధ్య ప్రశాంతంగా జరిగే ప్రక్రియగా భావిస్తారు. అయితే గద్వాల హెచ్డబ్ల్యూసీఎస్ (చేనేత సహకార సంఘం) ఎన్నికలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతున్నాయి. ఈరోజు ప్రారంభమైన పోలింగ్ మున్సిపల్ ఎన్నికలను తలపించేలా ఉత్కంఠభరితంగా మారింది."నువ్వా... నేనా?", "నాకు ఓటు – నీకు ఓటు" అన్నట్టుగా అభ్యర్థులు తీవ్ర ప్రచారం నిర్వహించగా, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం వరకు పోటీ కొనసాగింది. సంఘం పరిసరాలు రాజకీయ ఎన్నికల వాతావరణాన్ని తలపించగా, కార్యకర్తల హడావుడి, మద్దతుదారుల సందడి, ఓటర్ల రాకపోకలతో ప్రాంతం కోలాహలంగా మారింది.ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితులు సాధారణంగా మున్సిపల్ లేదా శాసనసభ ఎన్నికల్లోనే కనిపిస్తాయని భావించే స్థానికులు, "చేనేత సహకార సంఘం ఎన్నికలు కూడా ఇంత హోరాహోరీగా జరుగుతాయా?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చేనేత సంఘం ఎన్నికలు ఈ స్థాయిలో రాజకీయ రంగు పులుముకోవడం, గెలుపు కోసం అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా పోటీ పడడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గద్వాల చేనేత సహకార సంఘం ఎన్నికలు ఇప్పుడు సాధారణ సంఘ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలను తలపించే రాజకీయ పోరుగా మారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు