
జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట సత్తిబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దాట్ల పృథ్వీరాజ్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల బుధవారం 20 వార్డుల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారం, తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి, ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కు వివరించడానికి కృషి చేస్తామన్నారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ముమ్మిడివరం నగర పంచాయతీకి 200 కోట్ల ఇంటింటికి మంచినీటి పథకం తీసుకువచ్చి ప్రతి ఇంటికి మంచినీరు అందించడం లక్ష్యంగా ఈ పథకం తీసుకురావడం జరిగిందని, రాబోయే మూడు సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న నగర పంచాయతీలో సిమెంట్ రోడ్లు వేసేలా బుచ్చిబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ చేపట్టే ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ ఈ రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, దొమ్మేటి రమణ కుమార్, మలపర్తి బాలకృష్ణ, అడబాల సతీష్ కుమార్, వీరస్వామి నాయుడు, సరిపెల్ల శ్రీను రాజు, పిల్లి నాగరాజు, గొల్లపల్లి గోపి, యాళ్ల ఉదయ్, మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, పాయసం చిన్ని, ఏడిద శివ, ఎస్ఎంఎస్ ప్రసాద్, సానబోయిన సోమయ్య, సరిపెల్ల నాగరాజు, జాగు సత్తిబాబు, పండు, నిమ్మకాయల విషు, కాకి మాణిక్యం, జనపల్లి సత్యనారాయణ, రెడ్డి శ్రీను, రెడ్డి సుబ్బారావు, కాశి లాజర్, నితిపూడి వంశీ, సేలం శ్రీనివాసరావు, చప్పిడి ప్రసాద్, 20 వార్డుల ఇంచార్జులు పాల్గొన్నారు.