
జనం న్యూస్ ఆగస్టు 16 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)ముమ్మిడివరం: ముమ్మిడివరం టౌన్ తెలుగు యువత అధ్యక్షులు కడలి నాగు జన్మదిన వేడుకలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కడలి నాగు పార్టీ కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహం, గోలకోటి దొరబాబు, కొమ్మనుపల్లి పిఎసిఎస్ చైర్మన్ పోదోకు బాలు, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార ఆర్గనైజేషన్ కార్యదర్శి మెండి కమల, సొసైటీ అధ్యక్షులు దొమ్మేటి రమణ కుమార్, దాట్ల బాబు, మహేష్ బాబు అభిమాన సంఘ అధ్యక్షులు బొక్క అఖిల్, ఎస్సి సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, అతిలి ప్రసన్న, టౌన్ సోషల్ మీడియా అధ్యక్షులు రాంకిరణ్, కేశవ స్వామి దేవస్థానం చైర్మన్ కంచర్ల సురేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.