
జనం న్యూస్ సెప్టెంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వాక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడిగా నూతనంగా నియమితులైన అడ్వకేట్ హుస్సేన్‌కు మూసాపేట్ డివిజన్లో ఘనంగా సన్మానం నిర్వహించారు. మూసాపేట్ చౌరస్తాలోని మసీదు ఎదుట మూసాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చున్ను పాషా ఆధ్వర్యంలో ఆయన మిత్రబృందం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి హుస్సేన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా సీనియర్ నాయకుడు నవాజ్ పాషా, ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో కూడా అడ్వకేట్ హుస్సేన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మైనార్టీల సంక్షేమం కోసం నూతన కమిటీ సభ్యుడిగా హుస్సేన్ తనవంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూసఫ్ పాషా, ఖాజా అర్షద్, సోను, జకీర్, అమీర్, మౌలానా, పి. మధు, కె. రాము తదితరులతో పాటు మూసాపేట్ డివిజన్‌కు చెందిన యువజన నాయకులు, సీనియర్ నాయకులు, సేవాదళ్ నాయకులు, మైనార్టీ సోదరులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అడ్వకేట్ హుస్సేన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అడ్వకేట్ హుస్సేన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వాక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన పదవికి పూర్తి న్యాయం చేస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణతో పాటు మైనార్టీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.