
జనం న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూసాపేట్ ఆంజనేయ నగర్ రెసిడెన్స్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జె. మహేందర్ ప్యానల్ సభ్యులు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు ఎన్నికల్లో విజయం సాధించిన జె. మహేందర్ ప్యానల్ సభ్యులందరినీ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఆంజనేయ నగర్ రెసిడెన్స్ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, కాలనీవాసుల సంక్షేమం కోసం నూతన పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని కాలనీ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు భద్రతా పరంగా కాలనీలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదని వారి దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై వెంటనే స్పందించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆంజనేయ నగర్ కాలనీవాసుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చి అందుకు కావలసినటువంటి ఆర్థిక సహాయం వారికి అందజేశారు.నూతనంగా ఎన్నికైన పాలకవర్గం కాలనీవాసుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరి సహకారంతో ఆంజనేయ నగర్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల శేఖర్ గుప్తా, జె. మహేందర్ ప్యానల్ సభ్యులు, కాలనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.