
జనం న్యూస్ జూన్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థాన చైర్మన్ సామల బిక్షపతి నమస్తే తెలంగాణ సీనియర్ రిపోర్టర్ సామల సూర్యం సోదరుడు సామల రఘు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రఘు నివాసానికి వెళ్లి సామల రఘు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు రఘు కు ముగ్గురు కూతుళ్లు ,భార్య రమాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రఘు కుమార్తెలకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపి ధైర్యంగా ఉండాలని అని కుటుంబ సభ్యులకు తెలిపారు ఎమ్మెల్యే వేంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి (బుజ్జన్న) రవీందర్, కాంగ్రెస్ , మాజీ జెడ్పిటిసి చల్లా చక్రపాణి,, పత్తి పాక గ్రామ మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, నాయకులు ఉన్నారు.