
ప్రజా సమస్యల పరిష్కారమే కార్యకర్తల ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచన
జనం న్యూస్, జులై 15, జగిత్యాల జిల్లా, మెట్పల్లి: మెట్పల్లి పట్టణ మాజీ బీజేపీ అధ్యక్షుడు, 26వ వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ ఆయన నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మెట్పల్లి పట్టణ బీజేపీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి సమకాలీన రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.అనంతరం పట్టణ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆత్మీయంగా భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ కౌన్సిలర్లు బొడ్ల రమేష్, అరిసె వనజ–మురళి, అరిగెల అనూష–రాకేష్, బీజేపీ నాయకులు సుంకేటి విజయ్, బొడ్ల గౌతమ్, తాళ్లపెల్లి సతీష్, కొల్లేపు శ్రీనివాస్, గుజ్జె గంగాధర్, కాదాస్తు శ్రీనివాస్, పడిగేల శ్రీనివాస్, తోకల సత్యనారాయణ, ముక్క మధు, కట్కం రాము, కోరుట్ల పట్టణ మాజీ బీజేపీ అధ్యక్షుడు చిరుమల్ల ధనుంజయ్, కౌడ రమేష్, సాడిగే మహేష్, గోపు ప్రశాంత్, వెంకట్ రెడ్డి రాజు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.