
SIR ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని నాయకుల పిలుపు
జనం న్యూస్, జూలై 24, జగిత్యాల జిల్లా,మెట్పల్లి: పట్టణంలో BLA, BLA సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి SIR కోరుట్ల నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ, SIR ప్రక్రియను 100 శాతం విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రతి BLA, BLA సూపర్వైజర్ సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.అనంతరం మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, SIR ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని BLAలు, BLA సూపర్వైజర్లకు సూచించారు.ఈ సమావేశంలో SIR ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అజయ్, కో-ఆప్షన్ సభ్యుడు మాధవ రెడ్డిలను జువ్వాడి నర్సింగ్ రావు, మానాల మోహన్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, BLAలు, BLA సూపర్వైజర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.