
జనం న్యూస్, ఆగష్టు 27, జగిత్యాల జిల్లా, మెట్పల్లి: మెట్పల్లి మండల నూతన తహసీల్దార్ (ఎంఆర్ఓ)గా ముఫ్తార్ పాషా బాధ్యతలు స్వీకరించారు. మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన తహసీల్దార్ మాట్లాడుతూ మండల ప్రజలకు రెవెన్యూ సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.భూ సమస్యలు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు, పెన్షన్లు, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర రెవెన్యూ సేవల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.నూతన తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించడంతో మెట్పల్లి మండలంలో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.