
జనం న్యూస్, ఆగష్టు 04, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలోని పెద్ద చెరువును కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. చెరువు బండ్, పరిసర ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మెట్పల్లి పెద్ద చెరువు ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మత్స్యకారులకు జీవనాధారమని అన్నారు. అధికారుల అవగాహన లోపంతో జరిగిన పనుల కారణంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంటూ, బాధితులకు ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, చెరువు బండ్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. చెరువును గతంలాగే యథావిధిగా పునరుద్ధరించి, నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.మెట్పల్లి పట్టణ ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మెట్పల్లి పెద్ద చెరువు బండ్‌ను వెంటనే పునరుద్ధరించాలి. మత్స్యకారులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలి. చెరువును యథావిధిగా నీటితో నింపే చర్యలు చేపట్టాలి. మా పట్టణాన్ని, మా ప్రజలను ప్రభుత్వం కాపాడాలి" అని డిమాండ్ చేశారు.