

జనం న్యూస్ 23 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల పట్టణంలోని మెల్ల చెరువు చౌరస్తా నుంచి మెల్ల చెరువు,పిల్లిగుండ్ల కాలనీకి వెళ్లే రహదారిపై మురుగునీరు నిల్వ ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షపు నీటితో పాటు మురుగునీరు కూడా అక్కడే నిలిచిపోవడంతో రాకపోకలు దాదాపు అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా పిల్లిగుండ్ల కాలనీకి చెందిన పాదచారులు వృద్ధులు,మహిళలు,విద్యార్థులు పట్టణానికి వెళ్లి రావడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సైతం సురక్షితంగా నడిచే మార్గం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు మురుగునీటిలో జారి పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ పరిస్థితి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నిల్వ ఉన్న మురుగునీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.