
జనం న్యూస్ జూలై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : మేడ్చల్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు సతీష్ చారి తండ్రి పులిపాలుపుల కృష్ణమాచారి నిన్న స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈరోజు సతీష్ చారి నివాసానికి వెళ్లి కృష్ణమాచారి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సతీష్ చారి ని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కృష్ణమాచారి మరణం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, కృష్ణమాచారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని కృష్ణమాచారి కి ఘనంగా నివాళులర్పించారు.