
సమస్యల పరిష్కారానికై కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది వినూత్న నిరసన
జనం న్యూస్- జూలై 24- నాగార్జునసాగర్ టౌన్-తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్, ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో (ప్లాంట్ ఏ ట్రీ మేక్ ఏ రిక్వెస్ట్) అనే వినూత్న నినాదంతో ఈరోజు వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు తలపెట్టిన మొక్కలు నాటే కార్యక్రమం నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం రోజున నిర్వహించారు,మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వాడపల్లి శ్రీధర్ మాట్లాడుతూ రెండు నెలలుగా ఉద్యోగుల సమస్యలను వినిపించేందుకు అవకాశం లేదని ఆత్మగౌరవంతో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు ఆస్కారం లేదని అన్నారు, 185 వివిధ స్థాయి హాస్పిటల్స్ తో 4వేల మంది సిబ్బందితో ప్రభుత్వ వైద్య సేవలలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్న డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారబోతున్న వైద్య విధాన పరిషత్ కు కమీషనర్ పదవీ విరమణ చేసి రెండు నెలలు గడుస్తున్న ఇంతవరకు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించక పోవడంతో ఆయా వైద్య శాఖల పనితీరుపై సరైన పర్యవేక్షణ కొరవడిందని, వైద్యులు నర్సింగ్ పారామెడికల్ మినిస్ట్రియల్ సిబ్బంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇట్టి విషయాన్ని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించక పోవడంతో వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో మొక్కలు నాటుదాం -మనవి చేద్దాం (ప్లాంట్ ఏ ట్రీ మేక్ ఎ రిక్వెస్ట్) అంటూ ఒక వినూత్న కార్యక్రమం మొదలు పెట్టామని అన్నారు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు-మా సమస్యల పరిష్కారానికి కమిషనర్ నియామకం ఎంతో అవసరం అంటూ ఈరోజు నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి లో వైద్యులు సిబ్బంది కలిసి మొక్కలు నాటారు, ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ ఇప్పటికైనా తమ ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు, అత్యవసర వైద్య సేవలు అందించే వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్నందున ఉద్యమాలు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించలేక ఇటువంటి సున్నితమైన చర్యల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకుంటే తాము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో హాస్పటల్ మెడికల్ సూపర్ండెంట్ డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రవి, డాక్టర్ కోటియా నాయక్, ఫిజియోథెరపీ డాక్టర్ సోమశేఖర్, నర్సింగ్ సూపర్నెంట్ పొలిన, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వాడపల్లి శ్రీధర్, ఫార్మసీ సూపర్వైజర్ జ్యోతి, బ్రాంచ్ సెక్రటరీ రాములు, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు శ్రీదేవి, నిర్మల మరియు హాస్పటల్ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.