
జనం న్యూస్ ఆగస్టు 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : సామాజిక సేవ, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న యక్కంటి వెంకటరెడ్డి కి మానం ఇన్స్పిరేషన్ ఆఫ్ ఇండియా అవార్డు2026 లభించింది.
మానం ఫౌండేషన్ ఆధ్వర్యంలో, 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు సాధించడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నందుకు వెంకటరెడ్డి ని ఈ పురస్కారంతో సత్కరించారు.కూల్ ఎవరెస్ట్ ఐస్క్రీమ్స్ వ్యవస్థాపకుడిగా, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ కూకట్పల్లి అధ్యక్షులుగా వెంకటరెడ్డి సేవలు అందిస్తున్నారు. పేదలు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలతో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు.వెంకటరెడ్డి ప్రతిభ, సేవా దృక్పథం, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మరింతగా సేవ చేయాలని ఆకాంక్షించారు.హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గానసభ కళాక్షేత్రంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా అవార్డు అందుకున్న యక్కంటి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరింత బాధ్యతతో ప్రజాసేవ కొనసాగిస్తానని తెలిపారు.సామాజిక సేవకు మరింత ప్రోత్సాహంగా నిలిచిన ఈ పురస్కారం వెంకటరెడ్డి సేవా ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.