
జనం న్యూస్, మే 20,అచ్యుతాపురం: అచ్యుతా పురం మండలం పూడిమడక గ్రామంలో యువత మత్తు పదార్థాలకు, గంజాయికి దూరంగా ఉండాలని స్థానిక సీఐ చంద్రశేఖర రావు,ఎస్సై సుధాకర్ ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవు తున్నాయని అన్నారు. మత్తుపదార్థాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఇందుకు కారణమవుతున్న గంజాయి పై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. మత్తు పదార్థాలు సేవించిన, అమ్మినా పోలీసు వారికి తెలియ పరచినట్లయితే వెంటనే వారి పైన చర్యలు తీసుకోబడతాయని అలాగే మత్తు పదార్థాలకు బానిస అయినట్లయితే వారిని అడిక్షన్ కేంద్రానికి తరలించి వారిని సక్రమంగా మార్చడానికి దోహదపడతామని అలాగే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తుపదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.