
ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిరూపంగా రక్షాబంధన్. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మరింత బలపరిచే పవిత్ర పండుగ
జనం న్యూస్ వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు

జనం న్యూస్ 28 ఆగస్టు వికారాబాద్ జిల్లా :- అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్నిలుస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటారు. సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇస్తూ కానుకలు అందజేస్తారు. చిన్ననాటి అల్లరి నుంచి జీవితంలోని ప్రతి మలుపులో ఒకరికొకరు తోడుగా నిలిచే అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది. కష్టాల్లో ధైర్యం చెప్పడం, సంతోషాల్లో కలిసి పంచుకోవడం, అవసరమైనప్పుడు అండగా నిలవడం ఈ బంధంలోనిగొప్పతనం. రక్తసంబంధానికి మించిన ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో దూరంగా ఉన్న కుటుంబ సభ్యులను సైతం ఈ పండుగ ఒక్కచోటికి చేర్చి అనుబంధాలను గుర్తుచేస్తోంది. అందుకే రక్షాబంధన్ కేవలం రాఖీ కట్టే పండుగ మాత్రమే కాకుండా.. "మన బంధం ఎప్పటికీ చెదరకూడదు" అనే ప్రేమకు ప్రతిజ్ఞగా నిలిచే పవిత్ర వేడుక అని పలువురు పేర్కొంటున్నారు.